Skip Navigation
The Endowment for Human Development
The Endowment for Human Development
Improving lifelong health one pregnancy at a time.
Donate Now Get Free Videos

Multilingual Illustrated DVD [Tutorial]

The Biology of Prenatal Development




గర్భస్థ శిశువికాస జీవ విజ్ఞానము

.తెల [Telugu]


National Geographic Society This program is distributed in the U.S. and Canada by National Geographic and EHD. [learn more]

Choose Language:
Download English PDF  Download Spanish PDF  Download French PDF  What is PDF?
 

The Fetal Period (8 Weeks through Birth)

Chapter 37   9 Weeks: Swallows, Sighs, and Stretches

భ్రూణదశ జననం అయ్యేవరకు కొనసాగుతుంది.

9 వారాలకు, బొటన వేలు చీకడం ప్రారంభమవడం మరియు పిండం అమ్నియోటిక్ ద్రవాన్ని మ్రింగ గలగడం చూడవచ్చు.

గర్భస్థ శిశువు ఏదైనా వస్తువును పట్టుకోగలగడం తలను ముందుకు వెనుకకు కదిలించ గలగడంతో పాటు నోటి దవడలు తెరువడం మూయడం, నాలుక కదింలించడం, నిట్టూర్చడం మరియు శరీరాన్ని సాగదీయడం చేయగలదు.

ముఖం, అరి చేతులు అరి కాళ్ళలో గల నాడులు స్వల్ప స్పర్శను గుర్తించ గలవు.

అరికాళ్ళపై "స్వల్ప స్పర్శకు ప్రతిస్పందనగా" గర్భస్థ శిశువు పిరుదులను, మోకాళ్ళను వంచుతుంది మరియు కాలి వేళ్ళను వంచవచ్చు.

ఇప్పుడు కంటి రెప్పలు పూర్తిగా మూసుకుని ఉంటాయి.

కంఠనాళంలో ఓకల్ లిగ్మెంట్లు కనిపించడం స్వరనాళాల అభివృద్ది ప్రారంభాన్ని సూచిస్తుంది.

గర్భస్థ ఆడ శిశువుకు, గర్భాశయం గుర్తించగలిగేలా తయారవడం ఊజోనియా అని పిలువబడే అపరిపక్వ పునరుత్పత్తి కణాలు అండాశయంలో ప్రతిరూపాలను ఉత్పత్తిచేయడం కొనసాగుతుంది.

బాహ్య జననాంగాలు మగ లేదా ఆడ శిశువు అని ప్రత్యేకంగా తెలిసేలా తయారవడం ప్రారంభమవుతుంది.

Chapter 38   10 Weeks: Rolls Eyes and Yawns, Fingernails & Fingerprints

9 మరియు 10 వారాల మధ్య ఉత్పాతంలా జరిగే అభివృద్ధి శరీరం బరువును 75% మించి పెంచుతుంది.

10 వారాలకు, పై కంటిరెప్పపై స్పందన కలిగిస్తే కనుగుడ్డు క్రిందివైపుకు దొర్లడం జరుగుతుంది.

పిండం ఆవలించడం మరియు తరచు నోటిని తెరవడం మూయడం చేస్తుంది.

అత్యధిక పిండాలు కుడి బొటనవేలు చీకడం చేస్తాయి.

బొడ్డు నాళంలోని పేగు భాగాలు ఉదర భాగం ఖాళీ ప్రదేశం లోకి వెను దిరిగి వస్తుంటాయి.

దాదాపు అన్ని ఎముకలు గట్టిగా తయారవడం జరుగుతుంటుంది.

చేతి మరియు కాలి వేళ్ళకు గోర్లు పెరగడం ప్రారంభమవుతుంది.

ఫలదీకరణం జరిగిన 10 వారాలకు విలక్షణ వేలి ముద్రలు బయటపడతాయి. ఈ నమూనాలను జీవితాంతం గుర్తింపు కోసం ఉపయోగించవచ్చు.

Chapter 39   11 Weeks: Absorbs Glucose and Water

11 వారాలకు ముక్కు మరియు పెదాలు పూర్తిగా తయారవుతాయి. ప్రతి ఇతర శరీర భాగం లాగానే వీటి ఆకారం మానవ జీవిత చక్రం లోని ప్రతి దశలో మార్పు చెందుతుంది.

పేగులు గర్భస్థ శిశువు మ్రింగిన గ్లూకోజు మరియు నీటిని పీల్చుకోవడం ప్రారంభిస్తాయి.

ఫలదీకరణ సమయంలోనే ఆడ లేదా మగ అని నిర్ణయించబడినా బాహ్య జననాంగాలు ఇప్పుడు స్పష్టంగా మగ లేదా ఆడ అని తెలుసుకోవడానికి వీలుగా తయారవుతాయి.

Chapter 40   3 to 4 Months (12 to 16 Weeks): Taste Buds, Jaw Motion, Rooting Reflex, Quickening

11 మరియు 12 వారాల మధ్య పిండం బరువు దగ్గర దగ్గర 60% పెరుగుతుంది.

12 వారాలకు గర్భ దశలోని మూడువంతులలో మొదటి వంతు లేదా ట్రైమెస్టర్ పూర్తి అవుతుంది.

వేరువేరు స్వాద గ్రంధులు ఇప్పుడు నోటిలోపలి భాగాన్ని ఆవరిస్తాయి.
జననం నాటికి, స్వాద గ్రంధులు కేవలం నాలుక మరియు నోటి పై భాగంలో ఉంటాయి.

మల విసర్జన ఎంతో ముందుగా 12 వారాలకే ప్రారంభం అయి సుమారు 6 వారాలు కొనసాగుతుంది.

గర్భస్థ పిండం మరియు కొత్తగా ఏర్పడిన పెద్ద పేగులు తొలుత విసర్జించిన పదార్ధాలను మెకోనియమ్ అని పిలుస్తారు. ఇది జీర్ణ ఎంజైములు, మాంసకృత్తులు మరియు జీర్ణవాహిక వదిలిన మృత కణాలతో కూడి ఉంటుంది.

12 వారాలకు శరీర ఊర్ధ్వ భాగం పొడవు మొత్తం శరీర పొడవు అనుపాతంతో పోల్చితే ఆఖరి దశకు చేరుకుంటుంది. శరీర క్రింది భాగం పొడవు శరీర అనుపాతంలో పూర్తిస్థాయికి చేరుకోవడానికి ఎక్కువ కాలం తీసుకుంటుంది.

శరీరవెనుక మరియు తలపై భాగాలు తప్ప గర్భస్థ శిశువు యొక్క మొత్తం శరీరం ఇప్పుడు స్వల్ప స్పర్శకు ప్రతిస్పందిస్తుంది.

లింగ ఆధారిత అభివృద్ధి భేదాలు మొదటి సారిగా కనిపిస్తాయి. ఉదాహరణకు ఆడ గర్భస్థ శిశువు దవడల కదలికలను మగ శిశువు కంటే ఎక్కువగా ప్రదర్శిస్తుంది.

ఇంతకు ముందు చూసినట్లు నోటి దగ్గర ప్రేరణ జరిగితే వెనుక్కు ముడుచుకునే ప్రతిస్పందనకు భిన్నంగా ప్రేరేపించిన వస్తువు వైపు మళ్ళడం మరియు నోరు తెరవడం ద్వారా ప్రతిస్పందనలుంటాయి.. ఈ ప్రతిస్పందనను "రూటింగ్ రెస్పాన్స్" అంటారు. ఇది జననం తరువాత కూడా కొనసాగుతుంది, నవజాత శిశువు పాలు త్రాగే సమయంలో తల్లి చనుమొనలను వెతుక్కోవడానికి ఉపయోగపడుతుంది.

ముఖాకృతి బుగ్గల భాగంలో కొవ్వు చేరడం ప్రారంభం అవడంతో పరిణితి చెందుతుంటుంది. మరియు దంతాల అభివృద్ధి ప్రారంభమవుతుంది.

15 వారాలకు, రక్తాన్ని ఉత్పత్తిచేసే మూలకణాలు బయలుదేరి ఎముకలలోని మజ్జలో వృద్ది చెందుతాయి. అత్యధిక రక్త కణాల నిర్మాణం ఇక్కడే జరుగుతుంది.

పిండ కదలికలు 6 వారాలకే ప్రారంభమయినప్పటికీ గర్భంతో ఉన్న స్త్రీ పిండ కదలికలను 14 మరియు 18 వారాల మధ్య గమనించ గలుగుతుంది. సాంప్రదాయకంగా ఈ సంఘటన క్వికెనింగ్ అని పిలువబడుతుంది.

Chapter 41   4 to 5 Months (16 to 20 Weeks): Stress Response, Vernix Caseosa, Circadian Rhythms

16 వారాల సమయంలో గర్భస్థ శిశువు ఉదరంలోకి సూదిని చొప్పించే పద్ధతిని ప్రయోగిస్తే ఒత్తిడి ప్రభావానికి స్పందించే హార్మోనుల విడుదల ప్రక్రియ వెంటనే ప్రారంభమై నొరాడ్రెనలైన్ లేదా నొరాపైనేఫ్రైన్ అనే హార్మోను రక్త ప్రవాహంలోకి విడుదల అవుతుంది. అప్పుడే పుట్టిన శిశువులు మరియు పెద్దలు ఇద్దరూ దాడికి గురి అయిన పరిస్థితులలో ఒకే రకంగా స్పందిస్తారు.

శ్వాస వ్యవస్థలో శ్వాసనాళాల వ్యవస్థ దాదాపు పూర్తి అవుతుంది.

వర్నిక్స్ కాసియోసా అనే తెల్లని రక్షణ పధార్ధం గర్భస్థ శిశు దేహం చుట్టూ ఆవరిస్తుంది. చర్మానికి అమ్నియోటిక్ ద్రవం ప్రభావం వల్ల దురద, నొప్పి లాంటి ఇర్రిటేషన్స్ రాకుండా వర్నిక్స్ కాపాడుతుంది.

19 వారాల నుండి, పిండ కదలిక శ్వాస పీల్చడం మరియు గుండె కొట్టుకోవడంలో దైనిక క్రమం ప్రారంభమవుతుంది. దీన్ని సర్కాడియన్ రిధమ్ అంటారు.

Chapter 42   5 to 6 Months (20 to 24 Weeks): Responds to Sound; Hair and Skin; Age of Viability

20 వారాలకు వినికిడి అవయవం అయిన కోచ్ లియా పూర్తిగా తయారైన చెవి అంతర్భాగంలో పూర్తి సైజుకు ఎదుగుతుంది. ఇప్పటినుండి గర్భస్థ శిశువు పెరుగుతున్న ధ్వని తీవ్రతలకు స్పందిస్తుంది.

నెత్తి చర్మంపై వెంట్రుకలు మొలవడం ప్రారంభమవుతాయి.

అన్ని చర్మ పొరలు మరియు నిర్మాణాలు కేశ మూలాలు మరియు గ్రంధులతో సహా పూర్తి అవుతాయి.

ఫలదీకరణ తరువాత 21 నుండి 22 వారాలకు ఊపిరి తిత్తులు గాలి పీల్చుకునే కొంత సామర్ధ్యాన్ని సంపాదిస్తాయి. ఈ సమయాన్ని జీవన క్షమతా కాలము అని భావిస్తారు. ఎందుకంటే ఈ దశలోని కొన్ని గర్భస్థ శిశువులకు గర్భం బయట బ్రతకగలిగే అవకాశం ఉంటుంది. సుదీర్ఘ వైధ్య శాస్త్ర ప్రగతి పూర్తికాలానికి ముందే జన్మించిన శిశువుల ప్రాణాలను కాపాడ గలుగుతున్నది.

Chapter 43   6 to 7 Months (24 to 28 Weeks): Blink-Startle; Pupils Respond to Light; Smell and Taste

24 వారాలకు కనురెప్పలు తిరిగి విచ్చుకుంటాయి మరియు కళ్ళు చికిలించి ఉలిక్కిపడటం లాంటి క్రియలను ప్రదర్శిస్తుంది. అకస్త్మాత్తుగా వచ్చే పెద్ద ధ్వనులకు జరిగే ఈ ప్రతిస్పందన ముఖ్యంగా ఆడ గర్భస్థ శిశువులలో ముందుగా ప్రారంభమవుతుంది.

అనేక పరిశోధనల ప్రకారం అతి పెద్ద శబ్ధాలు గర్భస్థ శిశు ఆరోగ్యం పై చెడు ప్రభావాలను కలుగజేయవచ్చునని తెలుపుతున్నాయి. ఇలా అతి పెద్ద శబ్ధాలకు లోనయినప్పుడు వెంటనే జరిగే పరిణామాలలో పెరిగిన గుండె వేగం కొనసాగడం ఎక్కువగా ఉమ్మనీరు మ్రింగడం మరియు అర్ధాంతర ప్రవర్తనా మార్పులు ఉంటాయి. దీర్ఘకాలిక పరిణామాలలో, వినికిడి లోపం ఉంటుంది.

గర్భస్థ శిశు శ్వాస వేగం పెరుగుదల నిముషానికి 44 ఉఛ్చ్వాస నిశ్వాసలంత స్థాయికి పెరుగుతాయి.

గర్భదశలో మూడవ త్రైమాసంలో వేగంగా పెరిగే మెదడు గర్భస్థ శిశువు ఉపయోగించే శక్తిలో 50% వినియోగిస్తుంది. మెదడు బరువు 400 నుండి 500% మధ్య పెరుగుతుంది.

26 వారాలకు కళ్ళు కన్నీళ్ళను ఉత్పత్తి చేస్తాయి.

వెలుగుకు కంటి పాపలు స్పందించడం 27 వారాల ముందుగానే జరుగుతుంది. ఈ ప్రతిస్పందన రేటీనాకు చేరే వెలుగు మొత్తాన్ని జీవితాంతం క్రమబద్దీకరిస్తుంది.

వాసన తెలుసుకోవడానికి అవసరమైన అన్నిభాగాలు పనిచేసే స్థితికి చేరుకుంటాయి. నెలలు నిండక పూర్వమే పుట్టిన శిశువులపై జరిగిన అధ్యయనాలు ఫలదీకరణం జరిగిన 26 వారాలు అంత కంటే ముందు దశలోనే చెడువాసనలను గుర్తించే శక్తి శిశువుకు ఉన్నట్లు తెలుపుతున్నాయి.

అమ్నియోటిక్ ద్రవంలో తీపి పదార్ధాలను ఉంచడం వల్ల గర్భస్థ శిశువు ద్రవాలను మ్రింగడం పెరుగుతుంది. దీనికి భిన్నంగా చేదు పదార్ధాలను చేర్చితే గర్భస్థ శిశువు ద్రవాలను తక్కువగా మ్రింగుతుంది. ఇలా ఉంచినప్పుడు ముఖ కవళికలు తరచూ మారుతాయి.

అడుగులు వేస్తున్నట్లుగా ఉండే కదలికలు అంటే నడువడంలాగా అనిపించే కదలికలతో గర్భస్థ శిశువు పిల్లి మొగ్గలు వేస్తుంది.

గర్భస్థ శిశువు క్రొవ్వు కణాలు చర్మం అడుగున చేరడంతో తక్కువ ముడుతలతో కనిపిస్తుంది. జననం తరువాత శరీర ఉష్ణోగ్రత కాపాడేందుకు మరియు శక్తిని నిల్వ ఉంచుకునేందుకు క్రొవ్వు చాలా కీలక పాత్ర వహిస్తుంది.

Chapter 44   7 to 8 Months (28 to 32 Weeks): Sound Discrimination, Behavioral States

28 వారాలకు గర్భస్థ శిశువు ఎక్కువ మరియు తక్కువ ధ్వని తీక్షణతలను గుర్తించ గలుగుతుంది.

30 వారాలకు శ్వాస కదలికలు చాలా మామూలు అయిపోయి సగటు శిశువులో 30 నుండి 40% సమయం ఏర్పడుతుంటాయి.

గర్భ దశలో చివరి 4 నెలల కాలంలో శిశువు సమయ సమన్వయంతో కూడిన క్రియలను ప్రదర్శిస్తూ సమయం ప్రకారం విశ్రాంతి తీసుకుంటుంది. ఈ ప్రవర్తనా దశలు నిరంతరం పెరుగుతున్న కేంద్ర నాడీ మండల సంక్లిష్టతను తెలియజేస్తాయి.

Chapter 45   8 to 9 Months (32 to 36 Weeks): Alveoli Formation, Firm Grasp, Taste Preferences

సుమారు 32 వారాలకు నిజమైన అల్వియోలి లేదా గాలి తిత్తుల కణాలు ఊపిరితిత్తులలో అభివృద్ధి అవడం ప్రారంభమవుతుంది. అలా గాలి తిత్తుల నిర్మాణం పుట్టిన తర్వాత 8 సంవత్సరాల వరకు కొనసాగుతుంది.

35 వారాలకు గర్భస్థ శిశువు చేతితో గట్టిగా పట్టుకో గలిగే స్థితికి చేరుతుంది.

గర్భస్థ శిశువు వివిధ పదర్ధాలకు ఎక్స్పోజ్ అవడం పుట్టిన తర్వాత రుచి ప్రాధాన్యతలను ప్రభావితం చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఉదాహరణకు ఎవరి తల్లులు, లికోరైస్ కు ఆ రుచి ఇచ్చే సోంపు తిన్నారో, ఆ గర్భస్థ శిశువులు పుట్టిన తరువాత సోంపు అంటే ఇష్టపడుతున్నారు. అదే గర్భంలో ఉన్నప్పుడు దానికి దూరంగా ఉన్నవారు సోంపును ఇష్టపడటం లేదు.

Chapter 46   9 Months to Birth (36 Weeks through Birth)

గర్భస్థ పిండం పెద్ద మొత్తంలో ఈస్ట్రోజెన్ అనే హార్మోనును విడుదల చేసి ప్రసవనొప్పులను ప్రేరేపి స్తుంది, ఆ విధంగా గర్భస్థ శిశువు నుండి నవజాత శిశువుగా మార్పు ప్రారంభమవుతుంది.

ప్రసవ నొప్పుల సమయంలో గర్భాశయం బలమైన సంకోచాలకు గురి అయి శిశు జననం జరుగుతుంది.

ఫలదీకరణం నుండి జననం వరకు మరియు ఆ తరువాత మానవ వికాసం నిరంతర గతిశీలము మరియు సంక్లిష్టము అయి ఉంటుంది. అద్భుతమైన పిండ అభివృద్ధి ప్రక్రియ యొక్క కీలక ప్రభావం జీవిత కాలపు ఆరోగ్యంపై ఉంటుంది అని నూతన పరిశోధనా ఫలితాలు మరింతగా తెలియజేస్తున్నాయి.

మానవ అభివృద్ధి ప్రారంభదశ పై మన అవగాహన పెరిగే కొద్ది జననానికి ముందు మరియు జననం తరువాత ఆరోగ్యాన్ని పెంచుకునే సామర్ధ్యం కూడ పెరుగుతుంది.


Add a Comment

Your Name: Log In 3rd-party login: Facebook     Google     Yahoo

Comment: